కుంటాల జలపాతానికి ప్రతి ఆదివారం లగ్జరీ బస్సులు

కుంటాల జలపాతానికి ప్రతి ఆదివారం లగ్జరీ  బస్సులు
  • ప్యాకేజీలో శ్రీరాంసాగర్, పొచ్చెర, కుంటాల
  • పెద్దలకు రూ.1,099,   పిల్లలకు రూ.599

నిర్మల్, వెలుగు: టూరిజం ప్యాకేజీ కింద హైదరాబాద్ నుంచి కుంటాల జలపాతం వరకు ప్రతి ఆదివారం లగ్జరీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్​లోని ఎంజీబీఎస్ నుంచి ఉదయం 5 గంటలకు ఈ బస్సు బయలుదేరుతుంది. దీని కోసం పెద్దలకు రూ.1,099 , పిల్లలకు రూ.599 చార్జీగా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో బ్రేక్​పాస్ట్​, లంచ్​, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీ వెబ్​సైట్​లో ముందుగా రిజర్వు చేసుకునే అవకాశం కల్పించారు.