
సినిమా వాళ్లపై అసభ్యకర వీడియోలు చేస్తూన్న సోషల్ మీడియా యూట్యూబర్స్ పై టాలీవుడ్ హీరో, MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవలే అసహనం వ్యక్తం చేశారు.ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
అలాగే హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు విజ్ఞప్తి చేస్తూ అందుకు 48 గంటల సమయం కూడా ఇచ్చారు.
అయితే తాజాగా..తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు 'మా' అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ X లో స్పందిస్తూ.."అణచివేత మొదలైంది. నటీనటులు, వారి కుటుంబాలు మరియు వ్యక్తిగత దాడుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు..ఐదు యూట్యూబ్ ఛానెల్‌లు రద్దు చేయబడ్డాయి.ఇది ప్రారంభం మాత్రమే.భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని" ఎక్స్‌వేదికగా పోస్ట్ చేసింది.
ప్రస్తుతానికి ఐదు యూట్యూబ్ ఛానల్స్ లను రద్దు చేసినట్లుగా వెల్లడిస్తూ వాటి పేర్లను కూడా మెన్షన్ చేశారు.జస్ట్ వాచ్ BBC, ట్రోల్స్ రాజా, బాచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఎక్స్‌వైజెడ్‌ఎడిట్007 అనే యూట్యూబ్ ఛానల్స్ లను ప్రస్తుతానికి తొలగించారు. ఇకపై ఏ మాత్రం ఉపేక్షించేది లేదంటూ నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మా అసోసియేషన్ కొరడా విధించడంతో మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
The crackdown has begun. Five YouTube channels have been terminated for posting derogatory comments about actors, their families, and personal attacks. This is just the start. We will continue to update the list as we take further action...
— MAA Telugu (@itsmaatelugu) July 13, 2024
Terminated Channels:
— MAA Telugu (@itsmaatelugu) July 13, 2024
1. Just Watch BBC https://t.co/Hp0jjIMyYb
2. Trolls Raja https://t.co/v6UE3tuJiS
3. Bachina Lalith https://t.co/pDBaOs73Nl
4. Hyderbad Kurradu https://t.co/bFp3NxWrVy
5. xyzeditz007 https://t.co/J5VsuRpsCI
Stay tuned for more updates#MAA #RespectOurArtists