యాదాద్రి పీఠల వివాదంపై ఆలయ అధికారులు అప్రమత్తం

యాదాద్రి పీఠల వివాదంపై ఆలయ అధికారులు అప్రమత్తం

యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరైయ్యారు. వారితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ లు స్వామి వారిని దర్శించుకున్నారు. పూజ సమయంలో రేవంత్, ఆయన భార్య, కోమటిరెడ్డి, ఉత్తమ్ లు కొంత ఎత్తున్న పీఠలపై కూర్చున్నారు. వీరి పక్కన భట్టీ విక్రమార్క, కొండా సురేఖలు  తక్కువ ఎత్తున్న పీఠంపై కూర్చున్నారు. 

ఈ ఘటనపై  విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇద్దరు మంత్రులకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. యాదగిరిగుట్ట ఆలయంలో పీఠల వివాదంపై అధికారులు అప్రమత్తమైయ్యారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. పది సమాంతర పీఠలు కొనుగోలు చేశారు. ఒకేసారి 14 మంది వీఐపీలు కూర్చొని వేదా ఆశీర్వచనం చేయవచ్చని అధికారులు తెలిపారు.