సీఎం విజయ్కు హైకోర్టులో షాక్.. ఎన్నికల పిటిషన్ను కొట్టేయాలన్న అభ్యర్థన తిరస్కరణ

సీఎం విజయ్కు హైకోర్టులో షాక్.. ఎన్నికల పిటిషన్ను కొట్టేయాలన్న అభ్యర్థన తిరస్కరణ

చెన్నై: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలన్న విజయ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఓటరు ఎస్. దినేష్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ శుక్రవారం విచారణ జరిపారు. 

నామినేషన్ సమయంలో విజయ్ కీలక ఆస్తుల వివరాలను దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని దినేష్ ఆరోపించారు. నామినేషన్ పత్రాల్లో లోపాలు ఉన్నాయని, అప్పుడే రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించాల్సిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మీనారాయణన్ మాట్లాడుతూ అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందన్నారు.