సజ్జనార్కు డిజాస్టర్.. హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్..21 మంది ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్

సజ్జనార్కు డిజాస్టర్.. హైదరాబాద్ సీపీగా మహేశ్  భగవత్..21 మంది ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్
  • సిటీ సీపీకి ఫైర్ సర్వీసెస్ తో పాటు 
  • డిజాస్టర్ రెస్పాన్స్​ బాధ్యతలు
  • జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రాకు పోస్టింగ్
  • విమెన్ సేఫ్టీ వింగ్ డీజీగా సౌమ్య మిశ్రా

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర పోలీస్‌‌‌‌ శాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 21 మంది ఐపీఎస్​లను ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీఎస్‌‌‌‌ సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న వీసీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌ను ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌, డిజాస్టర్ రెస్పాన్స్ కు బదిలీ చేసి.. ఆయన స్థానంలో డీజీ మహేశ్‌‌‌‌భగవత్‌‌‌‌ను నియమించారు. ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డిని సివిల్ సప్లయీస్​ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేసి, ఆయన స్థానంలో గ్రేహౌండ్స్‌‌‌‌ డీజీ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను నియమించారు. జైళ్లశాఖకు స్వాతి లక్రాను, విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌, భరోసా, షీ టీమ్స్‌‌‌‌కు డీజీ సౌమ్యమిశ్రాను బదిలీ చేశారు. కొందరికి స్థానచలనం కల్పించడంతో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌‌‌‌గా ఉన్న వీసీ సజ్జనార్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో 1995 బ్యాచ్‌‌‌‌కు చెందిన మహేశ్ మురళీధర్ భగవత్‌‌‌‌ను నియమించారు. ఇప్పటివరకు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేసిన ఆయన గురువారమే సీపీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాచకొండ కమిషనరేట్‌‌‌‌తొలి సీపీగా మహేశ్‌‌‌‌భగవత్‌‌‌‌ సుదీర్ఘకాలం పనిచేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌‌‌‌గా 
ఉన్న వీసీ సజ్జనార్‌‌‌‌ను ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌, డిజాస్టర్ రెస్పాన్స్, విల్‌‌‌‌డిఫెన్స్‌‌‌‌ డీజీగా నియమించారు. అదనంగా స్పెషల్ పోలీస్ ఫోర్స్ డీజీ బాధ్యతలు అప్పగించారు. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న విక్రమ్ సింగ్ మాన్‌‌‌‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీపీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆయనకే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీ బాధ్యతలు అప్పగించారు.

ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్  

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీపీగా ఉన్న డాక్టర్ అనిల్ కుమార్‌‌‌‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌‌‌‌ఆర్టీసీ) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌గా నియమించారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న వై. నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌‌‌‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ బాధ్యతలు కూడా అప్పగించారు. డీజీపీ (ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్)గా ఉన్న డాక్టర్ సౌమ్య మిశ్రాను విమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా బదిలీ చేశారు. అదనంగా డీజీపీ ఆర్గనైజేషన్, డీజీపీ లీగల్ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆమె స్థానంలో డీజీపీ ఆర్గనైజేషన్, హోంగార్డ్స్ విభాగాల్లో పనిచేస్తున్న స్వాతి లక్రాను జైళ్ల శాఖ డీజీపీగా నియమించారు. అదనంగా డీజీపీ హోంగార్డ్స్ బాధ్యతలు అప్పగించారు. డీజీ చారుసిన్హాను ఏసీబీ డీజీపీగా, సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు. 


ఐపీఎస్ అధికారుల కొత్త పోస్టింగ్​ల వివరాలు..

క్ర.సం     అధికారి పేరు      ఐపీఎస్ బ్యాచ్      కొత్త పోస్టింగ్
1      డా. సౌమ్య మిశ్రా      1994     మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా
2      స్వాతి లక్రా     1995     జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్
3      మహేశ్ మురళీధర్ భగవత్     1995     హైదరాబాద్ పోలీస్ కమిషనర్
4     చారు సిన్హా     1996     డీజీ ఏసీబీ, సీఐడీ అదనపు భాద్యతలు
5      డా. అనిల్ కుమార్     1996     టీజీఎస్‌ఆర్టీసీ వీసీ, ఎండీ
6     వి.సి. సజ్జనార్     1996     డీజీ, ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ రెస్పాన్స్, సివిల్ డిఫెన్స్
7      వై. నాగిరెడ్డి     1997    కమిషనర్, సివిల్ సప్లైస్
8      సంజయ్ కుమార్ జైన్     1997    అదనపు డీజీపీ, ట్రైనింగ్ (ఎఫ్‌ఏసీ)
9     విక్రమ్ సింగ్ మాన్     1998    డీజీపీ, ఆపరేషన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్
10      ఎం. స్టీఫెన్ రవీంద్ర     1999     డైరెక్టర్, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో
11     ఆకున్ సబర్వాల్     2001     అదనపు డీజీపీ, లా అండ్ ఆర్డర్
12     ఎస్. చంద్రశేఖర్ రెడ్డి      2004     డైరెక్టర్, ఏసీబీ
13    కార్తికేయ    2006     ఐజీపీ,మల్టీ జోన్–1
14     కె. రమేశ్ నాయుడు     2006    ఐజీపీ, రైల్వేస్
15     డి. జోయల్ డేవిస్     2010    జాయింట్ డైరెక్టర్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్
16     జి. చందన దీప్తి     2012    డీఐజీ, జోన్–VII, జోగులాంబ (ఎఫ్‌ఏసీ)
17.    ఆర్. భాస్కరన్     2012     డీఐజీ, ఇంటెలిజెన్స్ (ఎఫ్‌ఏసీ)
18.     కె. నారాయణ నాయక్     2009     డీఐజీ, జోన్–II, బాసర (ఎఫ్‌ఏసీ)
19.    ఎల్.ఎస్. చౌహాన్     2009     డీఐజీ, కోఆర్డినేషన్
20.    శ్రీబాలాదేవి     ఎస్‌పీఎస్     డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), టీజీ-టీఎంఏఆర్ఎస్
21.     వి. అరవింద బాబు     ఎస్‌పీఎస్     డీసీపీ, ఎస్ఎం అండ్ ఐటీ, హైదరాబాద్