ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి.. ఎలక్టోరల్ బాండ్లు కట్టించుకున్నరు : మల్లు రవి

ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి..  ఎలక్టోరల్ బాండ్లు కట్టించుకున్నరు : మల్లు రవి
  • కేసీఆర్ పై కక్ష సాధింపు కాదు.. తప్పు చెస్తే శిక్ష తప్పదు: మల్లు రవి
  • కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిందని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ ​ప్రభుత్వ పాలనలో ఫోన్ ట్యాపింగ్​తో బెదిరించి.. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు కట్టించుకున్నారని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి ఆరోపించారు. సినిమా వాళ్లు, ప్రతిపక్ష పార్టీ నేతలు, సొంత పార్టీ నేతలపై ఫోన్ టాపింగ్ చేశారన్నారు. అసలు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసుకోడానికే కేసీఆర్ ను సిట్ విచారిస్తుందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మల్లు రవి మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పట్ల కక్ష సాధించడం లేదని.. తప్పు చేసిన వారు శిక్షి అనుభవించకతప్పదని చెప్పారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరాశకు గురి చేసిందని అన్నారు. బ్రిటిషర్స్ పాలనలో పెట్టిన బడ్జెట్ లా ఉందని విమర్శించారు.