భారీ వర్షాలు.. అబిడ్స్ లో రేకులు పడి ఒకరు మృతి

భారీ వర్షాలు.. అబిడ్స్ లో  రేకులు పడి ఒకరు మృతి

హైదరాబాద్  అబిడ్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఓవక్తిపై రేకులు పడిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ఫరీద్ అనే వ్యక్తి తల దాచుకోవడానికి గోడ పక్కన నిలబడ్డాడు. గాలికి ఒక్కసారిగా  4వ అంతస్తు నుండి రేకులు ఫరీద్ పై పడటంతో మృతి చెందాడు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహాన్ని  పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

హైదరాబాద్ లో గంట సేపు వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.రాజేంద్ర నగర్ లో అత్యధికంగా 6.2 సెం.మీ చార్మినార్ లో 6 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.