అనుమానంతో భార్య గొంతు కోసి చంపిండు!

అనుమానంతో భార్య గొంతు కోసి చంపిండు!
  • పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన భర్త
  • నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ టౌన్ లో ఘటన  

ఆర్మూర్, వెలుగు :- అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గుజరాత్​కు చెందిన జగదీశ్, మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన మమత(33), పదిహేనేండ్ల కింద పెండ్లి చేసుకున్నారు. వీరు ఆర్మూర్​టౌన్​లోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు. దంపతులకు ఇద్దరు కొడుకులు పవన్, నటరాజ్ ఉన్నారు. మమత విగ్రహాలకు కలర్ వేసే పనులు చేస్తుండగా, జగదీశ్​కట్టె మిల్లులో పని చేస్తున్నాడు. 

కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకుని గొడవపడుతుండేవారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన జగదీశ్​మరోసారి భార్యతో గొడవపడ్డారు.  కత్తితో భార్య మెడను కోయడంతో స్పాట్ లో చనిపోయింది. అనంతరం జగదీశ్ పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్​ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి, ఎస్​హెచ్​వో సత్యనారాయణగౌడ్​ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి బంధువులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.