మన ఊరు- మన బడి టెండర్లపై హైకోర్టులో విచారణ

మన ఊరు- మన బడి టెండర్లపై హైకోర్టులో విచారణ
  • అక్రమంగా టెండర్ సొంతం చేసుకుందని పిటిషనర్ల ఆరోపణ
  • ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించిన స్పెషల్ జీపీ సంజీవ్

హైదరాబాద్:  మన ఊరు - మన బడి పెయింటింగ్ టెండర్ల వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది.  హెచ్.ఈ.ఎస్ ఫార్చూన్ కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమంగా టెండర్ సొంతం చేసుకుందని పిటిషనర్లు వాదన వినిపించారు. పెయింటింగ్ టెండర్ నిబంధన ప్రకారం కాకుండా చట్టవిరుద్ధంగా టెండర్ దక్కిచుకున్నారని ఆరోపణలు చేశారు. 
నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరానికి గాను 135.50 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ పూర్తి చేసిన అనుభవం ఉండాలి. అయితే ఏవిధమైన పర్చేసింగ్ ఆర్డర్ కాపీలు దాఖలు చేయకుండా పలు ఇతర కంపెనీల నుండి అక్రమంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను హెచ్ఈఎస్ కంపెనీ సంపాదించి.. ఎలాంటి పని అనుభవం లేకపోయినా 10కి పైగా కంపెనీలకు పనులు పూర్తి చేసినట్టు ఫేక్ పత్రాలు సమర్పించారని పిటిషనర్లు వాదించారు. 
హెచ్ఈఎస్ ఫార్చూన్ కన్స్ట్రక్షన్ సంస్థ టెండర్లపై సువర్ణ పెయింట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. సువర్ణ సంస్థ తరపును ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ సంజీవ్ వాదనలు వినిపించారు.