
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్దమైంది. బుధవారం (మే 28) ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నేతలు గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని 8మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు గవర్నర్ కోరారు.
బుధవారం ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి హక్కు కోరుతూ 8 మంది బిజెపి సభ్యులు సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు వచ్చారు.
#WATCH | Manipur: 10 MLAs, including 8 BJP, 1 NPP, and 1 Independent MLA met Manipur Governor Ajay Kumar Bhalla at the Raj Bhavan in Imphal, to stake claim to form a government in the state. pic.twitter.com/BMM82tdy50
— ANI (@ANI) May 28, 2025
త్వరలోనే మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని బీజేపీనేత నిషికాంత్ సింగ్ తెలిపారు. మొత్తం 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు నిషికాంత్. గవర్నర్ మద్దతుదారులు సంతకాలతో కూడిన పత్రాన్ని అందజేశాం.. గవర్నర్ సానుకూలంగా స్పందించారని నిషికాంత్ తెలిపారు.
మంగళవారం మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో చర్చించాను.. గ్వాల్తాబి సంఘటనను పరిష్కరించడానికి నిరసనకారులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు. గత వారం రోజులుగా గ్వాల్తాబి సంఘటనపై నిరసనలు మైతేయిలు నివసించే ఇంఫాల్ లోయను కుదిపేశాయి.
►ALSO READ | డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ హాసన్ .. ఈ డీల్ లో భాగంగానే..
మే 2023 నుంచి ఇంఫాల్ లోయకు చెందిన మెయితీస్ ,కొండ ప్రాంతాలలో మెజారిటీగా ఉన్న కుకి-జో గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. జాతి హింసలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్ని అశాంతికి బాధ్యత వహిస్తూ అప్పటి సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయడగా.. ఫిబ్రవరి 13, 2025 మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించారు. 2027 వరకు పదవీకాలం ఉన్న అసెంబ్లీని తాత్కాలికంగా రద్దు చేశారు.