ఈ యాప్తో రూట్లన్నీ ట్రాక్ చేయొచ్చు.. ఏ బస్ ఎక్కాలో.. మెట్రో ఎక్కడ మారాలో కూడా చెప్పేస్తుంది !

ఈ యాప్తో రూట్లన్నీ ట్రాక్ చేయొచ్చు.. ఏ బస్ ఎక్కాలో.. మెట్రో ఎక్కడ మారాలో కూడా చెప్పేస్తుంది !

మన దేశ మ్యాపింగ్​ సర్వీస్​ మ్యాప్ ​మై ఇండియా తన యూజర్ల కోసం ఒక భారీ అప్​డేట్​ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం వ్యక్తిగత వాహనాల నావిగేషన్ కోసం ఎక్కువగా ఉపయోగపడే ఈ యాప్​, ఇకపై మెట్రో, బస్​లు, రైళ్ల సమాచారం కోసం వాడొచ్చు. యూజర్లు తమ డెస్టినేషన్​కి చేరుకోవడానికి బస్​లు, మెట్రోలు, లోకల్​ రైళ్ల రూట్లను ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఏ బస్ ఎక్కాలి? మెట్రో ఎక్కడ మారాలి? ఏ ప్లాట్​ఫామ్​ మీదికి రావాలి? వంటి వివరాల మ్యాప్స్​ను అందిస్తుంది. రైళ్లు లేదా బస్​లు ఏ టైంకి వస్తాయో, జర్నీకి ఎంత టైం పడుతుందో చూపిస్తుంది.

ఈ కొత్త ఫీచర్​ మనదేశంలో హైదరాబాద్​ సహా 18 సిటీల్లో అందుబాటులోకి వచ్చింది. సొంత వెహికల్స్​ కంటే పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​ను ఎంకరేజ్​ చేయడమే ఈ అప్​డేట్​ వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం అని కంపెనీ సీఈవో రోహన్ తెలిపారు. MAPPLS యాప్​లో ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇవి గూగుల్ మ్యాప్స్​లో కూడా ఉండవు. 

త్రీడి జంక్షన్​ వ్యూ.. క్లిష్టమైన ఫ్లై ఓవర్లు, జంక్షన్ల దగ్గర ఏ వైపు మళ్లాలో చూపిస్తుంది. స్పీడ్ బ్రేకర్లు లేదా ప్రమాదకరమైన మలుపులు ఉంటే ముందే వార్నింగ్ ఇస్తుంది. మహిళలు, ఒంటరి ప్రయాణికులు తమ లైవ్​ లొకేషన్​ను ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ అప్​డేట్ ఐఫోన్, వెబ్​ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యాప్​ స్టోర్ నుంచి ఈ యాప్​ను అప్​డేట్ చేయడం ద్వారా ఈ కొత్త ఫీచర్లను పొందొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా త్వరలోనే ఈ అప్​డేట్ రానుంది. 

వాట్సాప్ చానెల్​లో క్విజ్​!

వాట్సాప్​ చానెల్స్ వాడే వారి కోసం కొత్త ఫీచర్​ను తీసుకురానుంది. చానెల్స్​లో ఉండే సభ్యుల కోసం క్విజ్​ నిర్వహించేలా ఈ ఫీచర్​ను డిజైన్ చేశారు. ఇందులో చానెల్ అడ్మిన్​ ఒక ప్రశ్నను ఎంటర్​ చేసి మల్టిపుల్​ ఆప్షన్స్​ను పెట్టడం ద్వారా క్విజ్​ను క్రియేట్ చేయొచ్చు. అడ్మిన్స్​ క్విజ్​ను పబ్లిష్​ చేసేముందు సరైన ఆప్షన్​ని ఆన్సర్​గా గుర్తించాలి. ఆ తర్వాత ఆన్సర్​కు ఇమేజెస్​ ట్యాగ్ చేయొచ్చు. క్విజ్​లను ఇమేజ్ కంటెంట్​, టెక్స్ట్​ ప్రాంప్ట్​లు లేదా బ్రాండ్​లు ఎంగేజ్ చేస్తాయి.

క్విజ్​ లైవ్​లో నిర్వహిస్తే ఫాలోవర్లు, మెంబర్స్ ఆన్సర్​ని సెలక్ట్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఎంచుకున్నవాళ్లకు కన్ఫెట్టి యానిమేషన్​తో గిఫ్ట్​ వస్తుంది. ప్రతి ఆప్షన్​ని ఎంతమంది సెలక్ట్​ చేసుకున్నారు వంటివి చానెల్స్​ ఓనర్​లు చూడొచ్చు. ఈ క్విజ్​ల వల్ల పబ్లిక్​ అవేర్​నెస్ లేదా ఇంట్రెస్ట్ అంచనా వేయొచ్చు. అంతేకాదు, అడ్మిన ఈ క్విజ్​లో పార్టిసిపేట్ చేసేవారిని సేవ్ చేసుకోకపోతే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపిస్తుంది. పర్సనల్ ప్రైవసీ సెట్టింగ్స్​ను బట్టి అడ్మిన్​లు ప్రొఫైల్​ ఫొటోను మాత్రమే చూడగలరు. పేర్లు, నెంబర్లు సీక్రెట్​గా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్​ దశలో ఉంది.