బీసీల రిజర్వేషన్ల కోసమే కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష : మారన్న

బీసీల రిజర్వేషన్ల కోసమే కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష : మారన్న

ప్రతి బీసీ దీక్షలో పాల్గొనాలి

నిర్మల్, వెలుగు: బీసీల రిజర్వేషన్ కోసం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల మహా నిరాహార దీక్షలో ప్రతి ఒక్క బీసీ పాల్గొనాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మారన్న పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నారని  పేర్కొన్నారు.

 కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీసీల కోసం పోరాడుతున్న కవితకు అండగా ఉండాలని, దీక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్​చేయాలని కోరారు. అనంతరం నిరాహార వాల్​పేపర్స్​ను రిలీజ్​చేశారు. సమావేశంలో జిల్లా జాగృతి అధ్యక్షుడు లక్ష్మణచారి, ఓడ్డెర సంఘం అధ్యక్షుడు భూపతి, నాయి బ్రాహ్మణ నాయకులు గంగాధర్, జాగృతి నాయకులు పాల్గొన్నారు.