జ్యోతిష్యం: ఎదురెదురుగా శని భగవానుడు.... కుజుడు.. ఎవరికెలా ఉండబోతుంది..

జ్యోతిష్యం:  ఎదురెదురుగా శని భగవానుడు.... కుజుడు.. ఎవరికెలా ఉండబోతుంది..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి.  ఇలా మారే సమయంలో కొన్ని గ్రహాలు ఎదురెదురుగా వస్తాయి.  ఆగస్టు 9 శనివారం శని.. కుజుడు ఈ  రెండు గ్రహాలు 180 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా వస్తున్నాయి.  ఇలా రెండు గ్రహాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు  ప్రతియుతి దృష్టి యోగం ఏర్పడుతుంది.ఇది చాలా  శక్తివంతమైన యోగం. 12 రాశుల వారిపై ప్రభావం ఉంటుంది.   ప్రతియుతి దృష్టి యోగం వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .

మేషరాశి : కుజుడు.. శని .. 180 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా రావడం వలన ఈ రాశి వారికి శత్రువులు పెరిగే అవకాశం ఉంది.  ఆర్థిక వ్యవహారాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. వృత్తి.. వ్యాపారులు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తోటి వారివలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.  ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు. 

వృషభరాశి : ఈ రాశి వారికి శని.. కుజుడు ఎదురెదురుగా రావడం వలన శుభ ఫలితాలు ఏర్పడుతాయి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  పెళ్లి కోసం ఎదురుచూసే వారికి అనుకున్న సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు ఉంటాయి.జీవితం సంతోషంగా సాగిపోతుంది. 

మిథునరాశి : కుజుడు... శని గ్రహాలు ఎదురెదురుగా వచ్చి  ప్రతియుతి దృష్టి యోగం  ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి  కొన్ని కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆందోళన పెరగడం.. ఒత్తిడి.. మొదలైనవి ఉంటాయి.  వాహనం డ్రైవింగ్​ విషయంలో అప్రమత్తంగా ఉండండి.  కొందరు స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు.  ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటకరాశి: శని.. కుజుడు.. ఈ రెండు గ్రహాలు ఒకరిని మరొకరు చూసుకోవడం వలన ఈ రాశి వారికి ప్రతి విషయంలోను శుభఫలితాలు ఉంటాయి.  అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.  కొత్త ప్రాజెక్ట్​లు చేపడుతారు.  పెండింగ్​ లో ఉన్న పనులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కలగడంతో సంతోషంగా ఉంటారు.

సింహరాశి : శని.. కుజుడు ఎదురెదురుగా రావడం వలన ఈ రాశి వారికి కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది.  అనవసరంగా వాదనలు జరిగే అవకాశం ఉంది.  ఆదాయం ఉన్నా.. డబ్బు చేతిలో ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  మీరు ఎంతగానో ప్రేమిస్తున్న వారు దూరమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో గడపండి ఉపశమనం పొందుతారు. 

కన్యారాశి :  శని భగవానుడు కుజుడిని చూడటం వలన ఈ రాశి  వారికి కొన్ని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.  వాహనం డ్రైవింగ్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మీరు నమ్మిన వారు  మీ గురించి దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది.  ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు ఆశించిన లాభాలు ఉండవకపోవచ్చని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. 

తులారాశి :  ఈ రాశి వారికి ( శని ... కుజుడు 180 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా రావడం వలన) కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.    ప్రతియుతి దృష్టి యోగం వలన వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి.  పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. పెళ్లి సంబంధం చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు సూచిస్తున్నారు. 

►ALSO READ | Weekend Special Recipes : కరకరలాడే పకోడీ వెరైటీలు.. ఇంట్లోనే 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోండి

వృశ్చిక రాశి : శనిభగవానుడు..  కుజుడి చూడటం వలర  ఈ రాశి వారికి అన్ని విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్​ వస్తుంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.  నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. 

ధనస్సురాశి: శని .. కుజుడు ఎదురెదురుగా రావడంతో ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకావశం ఉంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోను చర్చించవద్దు.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశం ఉంది.  ప్రేమ.. పెళ్ళి వ్యవహారాలు వాయిదా వేయండి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

మకరరాశి : ఈరాశి వారికి ఈ యోగం చాలా కలసి వస్తుంది.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి.  కెరీర్​ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం... కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి.  ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.  ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. 

కుంభరాశి: ఈ రాశి వారు ఆర్ధిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది.  అనవసర పరిచయాలు చోటు చేసుకుంటాయి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగస్తులు .. వ్యాపారస్తులు ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు.  ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. దక్షిణామూర్తి స్త్రోత్రం పఠించండి .. అన్ని సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. 

మీనరాశి:  శని.. కుజుడు.. ఎదురెదురుగా రావడం వలన ఈ రాశి వారికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.  ఉద్యోగస్తుల విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మీరు తీసుకొనే నిర్ణయం కెరీర్​ విషయంలో లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశాలున్నాయి.