Weekend Special Recipes : కరకరలాడే పకోడీ వెరైటీలు.. ఇంట్లోనే 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోండి

Weekend Special Recipes : కరకరలాడే పకోడీ వెరైటీలు.. ఇంట్లోనే 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోండి

ఒకరోజు పెద్ద వర్షం కురిస్తే.. మరుసటి రోజు ముసురు పడుతోంది. ఏదేలా ఉన్నా వాతావరణం మాత్రం చల్లగా మారింది. దీనివల్ల ఇంట్లో, బయటే కాదు.. మనసూ  ఎవరికైనా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది. మరి భోజనప్రియులు సంగతేంటి..? వాళ్లైతే చల్లచల్లగా ఉన్నప్పుడు.. వేడివేడి పకోడీలు తినడానికే ఓటేస్తారు. మరింకెందుకు ఆలస్యం.. వెరైటీగా వేడివేడి పకోడీ తినండి.

స్వీట్ కార్న్

కావాల్సినవి: ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు -రెండు కప్పులు ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి- అర కప్పు బియ్యప్పిండి - రెండు టేబుల్ స్పూన్లు పసుపు - చిటికెడు, కారం - అర టీ స్పూన్ అల్లం- వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ చాట్ మసాలా - పావు టీ స్పూన్ ఇంగువ - చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె - సరిపడా

Also Read : కూరగాయలు, ఫ్రూట్స్ తాజాగా, ఫ్రెష్ గా ఉన్నాయని ఎలా గుర్తుపట్టాలి

తయారీ

ఒక పెద్ద గిన్నెలో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, ఉల్లిగడ్డ తరుగు వేసి బాగా కలపాలి. తర్వాత శెనగపిండి, బియ్యప్పిండి, పసుపు, కారం, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు పోయకుండా పిండిని కలపాలి. స్టప్పై పాస్పేట్టి నూనె వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, నూనెలో ముద్దలుగా వేయాలి. వీటిని టొమాటో సాస్తోతింటే రుచి అదిరిపోతుంది.

నూడిల్స్

కావాల్సినవి: నూడుల్స్ - ఒక కప్పు క్యారెట్ తురుము - ఒక టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ తరుగు - ఒక టేబుల్ స్పూన్ క్యాబేజీ తరుగు - ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు నూడుల్స్ మసాలా - ఒక టీ స్పూన్ శెనగపిండి - అర కప్పు ఉప్పు- తగినంత, నూనె - సరిపడా.

తయారీ

ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు, నూడుల్స్ వేసి ఉడికించాలి. నీళ్లు వడగట్టి నూడుల్స్ ని మరో గిన్నెలో వేయాలి. అందులో క్యారెట్ తురుము, క్యాబేజీ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి తరుగు, శెనగపిండి, ఉప్పు, నూడుల్స్ మసాలా వేసి కలపాలి. స్టవ్ పాన్పెట్టి నూనె వేడి చేయాలి. నూడుల్స్ మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసి నూనెలో డీపీపై చేయాలి. వీటిని సాస్ లేదా చట్నీతో తింటే చాలా బాగుంటాయి.

అన్నం పకోడా

కావాల్సినవి: అన్నం - ఒక కప్పు, ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు ఉడికించి, చిదిమిన అలుగడ్డ - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు కొత్తిమీర తరుగు - పావు కప్పు, శెనగపిండి - నాలుగు టేబుల్ స్పూన్లు కారం - ఒక టీ స్పూన్, పసుపు - చిటికెడు. చాట్ మసాలా - ఒక టీ స్పూన్, గరం మసాలా - ఒక టీ స్పూన్
ఇంగువ - అరటీస్పూన్, ఉప్పు- తగినంత, నూనె - సరిపడా క్యాబేజీ, క్యారెట్ తురుము - ఒక టేబుల్ స్పూన్ చొప్పున (కావాలంటే)

తయారీ

ఒక పెద్ద గిన్నెలో అన్నం వేసి మెత్తగా కలపాలి. తర్వాత అందులో ఉల్లిగడ్డ తరుగు, అలుగడ్డ ముద్ద, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, శెనగపిండి, కారం, పసుపు, ఉప్పు, చాటి మసాలా, గరం మసాలా, ఇంగువ, క్యాబేజీ, క్యారెట్ తురుము వేయాలి. సరిపడా నీళ్లు పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి. స్టప్పై పాన్పెట్టి నూనె వేడి చేయాలి. అందులో అన్నం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి డీ చేయాలి. వీటిని సాస్ లేదా పెరుగుతో నంజుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే.. పడేయకుండా ఇలా చేసుకోవచ్చు.

బ్లూమింగ్ ఆనియన్

కావాల్సినవి: శెనగపిండి - ఒక కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి (పెద్దది) ఒకటి ఒక కప్పు ఉప్పు- తగినంత, మిరియాల పొడి- అర టీ స్పూన్ జీలకర్ర పొడి- చిటికెడు కారం - పావు టీస్పూన్, నూనె - సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్

తయారీ

ఒక గిన్నెలో గుడ్డు సొన, పాలు పోసి బాగా కలపాలి. మరో గిన్నెలో శెనగపిండి, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సరిపడా నీళ్లు పోసి కలపాలి. తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డని పొట్టు తీసి, పువ్వు ఆకారంలో కట్ చేయాలి. అంటే అడుగువరకు కట్ చేయకుండా... మధ్యభాగం వరకు కాట్లు పెట్టాలి. దాన్ని ముందుగా గుడ్డు, పాల మిశ్రమంలో ముంచి, తర్వాత పిండిలో ముంచాలి. ఉల్లిగడ్డ మొత్తానికీ పిండి అంటించి ఐదు నిమిషాలు ఫ్రిజ్లో పెట్టాలి. ఈలోపు స్టౌవ్‎పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. దాంట్లో కాట్లు పెట్టిన ఉల్లిగడ్డ వేసి డీప్ ఫ్రై చేయాలి. దీన్ని సాస్ లేదా పెరుగుతో నంజుకోవచ్చు.