నడవలేక పోతున్నానని వ్యక్తి సూసైడ్...మృతుడు మెదక్ జిల్లా వాసి

నడవలేక పోతున్నానని వ్యక్తి సూసైడ్...మృతుడు మెదక్ జిల్లా వాసి

మియాపూర్, వెలుగు: నడవలేక పోతున్నానన్న మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​జిల్లాకు చెందిన ప్రదీప్​రావు(34) భార్య శాంతాబాయి, కూతురు, కుమారుడితో కలిసి మియాపూర్​లోని పీఏనగర్​ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా పెయింటర్​గా చేస్తున్నాడు. 

అతని భార్య ఓ డెంటల్​క్లినిక్​లో పని చేస్తోంది. 2 నెలల క్రితం ప్రదీప్​రావు పెయింటింగ్​పనిచేస్తూ ప్రమాదవశాత్తు కింద పడటంతో కాలికి తీవ్ర గాయమైంది. నడవలేని స్థితిలో ఇంటి వద్దే ఉంటున్నాడు. పనికి వెళ్లలేకపోతున్నానని మనస్తాపానికి గురయ్యాడు. 

సోమవారం భార్య డ్యూటీకి, పిల్లలు స్కూల్​కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ప్రదీప్​రావు ఉరేసుకొని కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.