రేపటి నుంచి ఉస్మానియాలో మెడికల్ కాన్ఫరెన్స్‌‌‌‌

రేపటి నుంచి ఉస్మానియాలో  మెడికల్ కాన్ఫరెన్స్‌‌‌‌

ఉస్మానియా మెడికల్ కాలేజీలో 3 రోజుల పాటు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా మెడికల్ కాలేజీలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు మెడికల్ కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించనున్నారు. ఉస్మెకాన్ పేరిట జరిపే ఈ కాన్ఫరెన్స్‌‌‌‌లో తొలిరోజు వర్క్‌‌‌‌షాపులు ఉంటాయి. రెండోరోజు స్పెల్‌‌‌‌ బి, మెడికల్ సింపోజియం, డయాగ్నజ్ క్లబ్, పోస్టర్ ప్రజంటేషన్, పేపర్‌‌‌‌‌‌‌‌, కేస్ ప్రజెంటేషన్, మెడ్ క్విజ్‌‌‌‌, మెడికల్ డమ్‌‌‌‌చరాడ్స్‌‌‌‌ తదితర పోటీలు నిర్వహిస్తారు. గెస్ట్ లెక్చర్స్ కూడా ఉంటాయని ఉస్మెకాన్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌ పరిపల్వి తెలిపారు. రెండో రోజు పోటీల్లో గెలుపొందిన విజేతలకు, చివరి రోజు ఫైనల్స్ నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ చైర్మన్‌‌‌‌ డాక్టర్  నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా వస్తారు.