
మైనర్ అమ్మాయిల ఫోటోలను న్యూడ్ చిత్రాలుగా మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న అజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు మేడిపల్లి పోలీసులు. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ఐడీలు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటాడు అజయ్ కుమార్. ఆ తరువాత వారి ఫోటోలు న్యూడ్ గా సృష్టించి లవ్ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతాడు. లవ్ చేయకుంటే సోషల్ మీడియాలో న్యూడ్ చిత్రాలను పంపిస్తానని బాధిరింపులకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ బాధితురాలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ కుమార్ జనగాం జిల్లా కొడకండ్ల కి చెందిన వ్యక్తిగా గుర్తించారు.