మే18న గోదావరిఖనిలో సింగరేణి జాబ్​మేళా

మే18న గోదావరిఖనిలో సింగరేణి జాబ్​మేళా

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా నిర్వహించనున్నట్లు ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరిఖని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎండీ ఎన్.బలరామ్​ సూచనలతో  జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

జాబ్​మేళాలో హైదరాబాద్​కు చెందిన 100 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నాయని,  ఆసక్తి గలవారు రెండు పాస్​పోర్టు సైజ్ ​ఫొటోలు, సర్టిఫికెట్ల జిరాక్స్​కాపీలతో ఆర్జీ 1 ఏరియాలోని జీవీటీసీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 16లోపు దరఖాస్తులను అందజేయాలన్నారు.