
- బిష్ణోయ్ తో చేసుకున్న నిశ్చితార్ధం కూడా రద్దు చేసుకున్నా: మెహరీన్ ఫిర్జాదా
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహరీన్ ఫిర్జాదా షాకింగ్ న్యూస్ వెల్లడించింది. గత మార్చి నెలలో హరియానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో చేసుకున్న నిశ్చితార్ధాన్ని కూడా రద్దు చేసుకున్నానని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించడం కలకలం రేపింది. ఇరువురి అభిప్రాయాలు కలవకపోవడంతో కలసి జీవించలేమని నిర్ణయానికి వచ్చి పెళ్లి వద్దనుకున్నామని.. గత మార్చిలో చేసుకున్న నిశ్చితార్ధాన్ని కూడా రద్దు చేసుకున్నామని స్పష్టం చేసింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుని హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకుంటున్న తరుణంలో గత మార్చిలో హఠాత్తుగా పెళ్లికి రెడీ కావడం సంచలనం రేపింది. మార్చి నెలలో కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి కొద్ది ముందు జైపూర్ లో ఘనంగా నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. నాని హీరోగా నటించిన ‘‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’’ తో తెలుగు సినిమాల్లో మెహరీన్ ఫిర్జాదా అరంగేట్రం చేసింది. ఈ సినిమా విడుదలకు ముందే మహానుభావుడు.. రవితేజతో బ్లాక్ బస్టర్ మూవీ ‘‘రాజా ది గ్రేట్’’..ల్లో నటించింది. ఎఫ్2 సినిమాలో యంగ్ బ్యూటీ నటతనతోనూ మెప్పించింది. ఇదే ఊపులో ఎఫ్3 లో కూడా నటించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కకముందే ఆమె పెళ్లి కి రెడీ కావడం.. నిశ్చితార్ధం జరిగిపోవడం జరిగిపోయాయి. అయితే లాక్ డౌన్ పీరియడ్ లో తన వుడ్ బీతో ఏం జరిగిందో గాని.. పెళ్లికి బ్రేకప్ చెప్పింది. తాను బిష్ణోయ్ ఇద్దరం కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇకపై తనకు బిష్ణోయ్ తో గాని.. అతని కుటుంబ సభ్యులతోగాని ఎలాంటి సంబంధాలుండబోవని స్పష్టం చేసింది. సినిమా అభిమానులు, మీడియా అందరూ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను గౌరవించి తన ప్రైవసీకి ఆటంకాలు కలిగించవద్దని కోరింది. పెళ్లి బ్రేకప్ కావడంతో సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నానని వివరించింది.