న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైల్లో ఢిల్లీకి చేరుకున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నా దేశం.. నా మట్టి (మేరా దేశ్.. మేరా మాటి) ప్రోగ్రామ్‌కు తెలంగాణ వ్యాప్తంగా వందలాది గ్రామాల నుంచి మట్టి సేకరించారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర ఏర్పాటు చేసిన కలశంలో ఈ మట్టి పోస్తారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ నుంచి దాదాపు 200 మంది స్పెషల్ ట్రైన్ లో (అమృత్ కలశ్ స్పెషల్ ట్రైన్)లో సాయంత్రం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వీరందరికీ ప్రగతి మైదాన్ లో వసతి ఏర్పాటు చేశారు.
