
పన్నా: గనిలో పనిచేసే కార్మికురాలిని అదృష్టం వరించింది. కొన్ని లక్షలు విలువచేసే 8 వజ్రాలు ఆ గనిలో ఆమెకు దొరికాయి. రచనా గోల్దర్ (50) మధ్యపదేశ్ లోని పన్నా జిల్లా హజారా ముద్దా ఏరియాలోని ఓ మైన్ ను లీజుకు తీసుకుని తవ్వకాలు చేపట్టింది.
ఎప్పట్లాగే రోజూ గనికి వెళ్లింది. మైన్ లో తవ్వుతుండగా 8 వజ్రాలను రచన కనుగొంది. వాటిని డైమండ్ ఎక్స్ పర్టులు తూకం వేయగా మొత్తం 2.53 క్యారట్లుగా తేలింది. వాటిలో ఒక డైమండ్ 0.79 క్యారట్ల బరువుంది. 8 డైమండ్లనూ రచన.. జిల్లా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేసింది. అక్కడ వాటిని వేలం వేయనున్నారు. ఈ వేలంలో కొన్ని లక్షల రూపాయలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన మొత్తంలో 12 శాతం ప్రభుత్వానికి పన్నుగా వెళ్తుంది. మిగతా మొత్తాన్ని రచనా గోల్డర్ కు అందిస్తామని అధికారులు తెలిపారు.