సీఎంఏ ఫౌండేషన్ పరీక్షలో .. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

సీఎంఏ ఫౌండేషన్ పరీక్షలో .. సత్తా  చాటిన గురుకుల విద్యార్థులు
  • 74 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌లో 39 మంది అర్హత
  • విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభినందనలు 

హైదరాబాద్, వెలుగు: సీఎంఏ ఫౌండేషన్ (కాస్ట్ అండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ అకౌంటెంట్) పరీక్షలో ఎస్సీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌లో ఎంఈసీ, సీఈసీ కోర్సు చదువుతూనే ఈ పరీక్షలో విశేష ప్రతిభ చాటారు. సీఎంఏ ఫౌండేషన్ ఈ పరీక్షను ఏటా నవంబర్, జూన్ నెలలో నిర్వహిస్తుంది. ఈ ఏడాది 2025 జూన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సీఎంఏ ఫౌండేషన్ పరీక్షలో ఎస్సీ గురుకులాలకు చెందిన 74 మంది పరీక్ష రాయగా, 39 మంది అర్హత సాధించినట్లు గురువారం సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. 

ఇందులో ఇబ్రహీంపట్నం బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో 23 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది, మేడ్చల్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో 23 మందిలో  ఏడుగురు, గౌలిదొడ్డి బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో 28 మందిలో 18 మంది అర్హత సాధించారు. ఈ ఫౌండేషన్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సెక్రటరీ అలుగు వర్షిణి అభినందించారు.