వర్షం తగ్గినా వరద తగ్గలే..నీటమునిగిన దోమల్ గూడ, గగన్ మహల్..రోడ్లపై మోకాళ్లతో వరదనీరు

వర్షం తగ్గినా వరద తగ్గలే..నీటమునిగిన దోమల్ గూడ, గగన్ మహల్..రోడ్లపై మోకాళ్లతో వరదనీరు

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్​ సిటీ మొత్తం జలమయమయ్యింది. కేవలం గంట సమయంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది.. ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా మహానగరంలో అన్ని ప్రాంతాలు నీటమునిగాయి. గరిష్టంగా 15 సెం.మీల వర్షపాతం కురిసింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాలు గురువారం (సెప్టెంబర్​18) ఉదయం వరకు కూడా నీటనే మునిగి ఉన్నాయి. సిటీ పరిధిలోని దోమల్​ గూడ, గగన్​ మహల్​ప్రాంతాలు మోకాళ్లతో నీళ్లలో మునిగాయి.  దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరోవైపు సిటీలోని శ్రీరాంనగర్​ బస్తీ కూడా జలదిగ్భంధనంలో చిక్కుకుంది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వర్షపునీటితోపాటు ఇళ్లలోకి డ్రైనేజీ వాటర్​ కూడా చేరడంతో రాత్రి నుంచి నిద్రలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. 

హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి పలు హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డికాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయిన జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు ( సెప్టెంబర్ 17, 18 ) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది న వాతావరణ శాఖ.