సంగారెడ్డి జిల్లా ప్రజలకు అలర్ట్.. ఆ సర్వీస్ రోడ్డు మూసివేశారు.. ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్..

సంగారెడ్డి జిల్లా ప్రజలకు అలర్ట్..  ఆ సర్వీస్ రోడ్డు మూసివేశారు.. ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్..

తెలంగాణలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం (సెప్టెంబర్ 17) కురిసిన కుండపోత వానలకు సంగారెడ్డి జిల్లాలో ఐదు  గ్రామాలకు రాకపోకల్ బందయ్యాయి. 

​సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నక్కవాగు ఉధృతంగా ప్రవహించడంతో.. పటాన్ చెరు మండలానికి చెందిన పోచారం వైపు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులోని సర్వీస్ రోడ్డుపై వరద నీరు  భారీగా చేరుకుంది. సర్వీస్ రోడ్డుపై నది ప్రవహిస్తున్నట్లుగా వదర ప్రవాహం ఉండటంతో అధికారులు ఆ రహదారిని మూసివేశారు.

​నక్కవాగు ఉధృతి కారణంగా ఐదు గ్రామాలకు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులను మరో మార్గంలో మళ్లించి, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. బుధవారం రాత్రి కురిసిన ఎడతెరిపిలేని వర్షాల వల్లే నక్కవాగులో నీటిమట్టం పెరిగి ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.