- రోడ్ షో లో మంత్రి అజారుద్దీన్
ఎల్లారెడ్డి, వెలుగు: పట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్‌షో కు మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ , ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథులుగా హారయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డుల్లో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని తెలిపారు. ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు, 100 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు, అడ్వన్స్డు టెక్నాలజీ సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అదే విధంగా ఇద్గా ప్రాంగణానికి కంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే అభివృద్ధికి ఓటు వేయడమేనని స్పష్టంగా పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి సరైన అభివృద్ధిని చూడలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మినిస్టర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ , మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు తిరుపతి, శ్రీకాంత్ శ్రీనివాస్,మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
