ఇప్పటి వరకు 2 లక్షల 10 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం: పొంగులేటి

ఇప్పటి వరకు 2 లక్షల 10 వేల  ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం: పొంగులేటి

హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీం కింద ఇప్పటి వరకు 2.10 లక్షల మంది ఎంపికైనట్లు తెలిపారు. వచ్చే నెల 10లోగా మిగతా లబ్ధిదారుల లిస్ట్ సిద్ధమవుతుందన్నారు.

 'పైలట్ ప్రాజెక్టులో 42వేల ఇండ్లు మంజూరు చేయగా.. 24 వేలు ప్రారంభమయ్యాయి. వీటిని ర్మాణానికి రూ. 130 కోట్లు చెల్లించాం. పారదర్శ కంగా అర్హుల ఎంపిక చేస్తున్నం. ప్రతిపక్ష ఎమ్మె ల్యేలకు 40 % పేర్లు ఇవ్వనున్నాం. కేటీఆర్ లిస్ట్ ఇవ్వలేదు.. అధికారులనే ఎంపిక చేయమన్నారు. మిగతా 60 శాతం ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి. ఐటీడీఏ పరిధిలో చెంచులకు 9,200 ఇండ్లు మంజూరు చేశాం. హైదరాబాద్లోని 16 స్లమ్లోస్లో నాలుగంతుస్తుల భవనాలు కడుతాం. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూ బ్నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిర్మిస్తం' అని పొంగులేటి తెలిపారు.