V6 News

సమద్ నవాబ్ కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం పరామర్శ

సమద్ నవాబ్ కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం పరామర్శ

కరీంనగర్ సిటీ, వెలుగు: ఇటీవల చనిపోయిన జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంఏ సమద్ నవాబ్ కుటుంబ సభ్యులను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్‌‌, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ ఉన్నారు.