హైకోర్టు స్టే విధిస్తుందనుకోలే.. బీసీ 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. మంత్రి పొన్నం ప్రభాకర్

హైకోర్టు స్టే విధిస్తుందనుకోలే.. బీసీ 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం తరపున మేం బలమైన వాదనాలు వినిపించాం.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇలా మధ్యంతర స్టే విధిస్తుందని అనుకోలేదు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్.  

బీసీ 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుంది.. కుల సర్వేలు నిర్వహించింది.. డెడికేటెడ్ కమిషన్ వేసింది.. సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది.. శాసన సభలో చట్టం చేసి గవర్నర్ కు పంపించాం.. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం.. ఇవాళ కోర్టు తీర్పు ఇలా వస్తుందని ఊహించదలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు మంత్రి పొన్నం. 

కాంగ్రెస్ హయాంలో  సామాజిక న్యాయం జరుగుతుంది.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంతరపున  కోర్టులో బలంగా  వినిపిస్తుంటే.. బీఆర్ ఎస్, బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్  కాలేదో జవాబు చెప్పాలని నిలదీశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.