గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
  • మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ, (హుస్నాబాద్), వెలుగు: రైతాంగానికి వెన్నెముకగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని, కాల్వల భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.శనివారం హుస్నాబాద్ లోని ఎల్లమ్మ ఆయలంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పెండింగ్​లో ఉన్న పనుల పురోగతిపై ఈవో కిషన్​రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.15 కోట్లతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ, సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. బతుకమ్మ, దసరా పండగలోపు పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. 

భవిష్యత్​లో టూరిజం హబ్ గా కప్పు గుట్ట, హరిత హోటల్ తేవడంతో పాటు చెరువును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వాటర్ బోట్స్ తీసుకొస్తామన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్​ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. యూరియా సరఫరాపై సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్​లో మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా విషయంలో మరింత పర్యవేక్షణ చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో యూరియా అందేలా చూడాలని సూచించారు. ఆయన వెంట సింగిల్​విండో చైర్మన్​శివ్వయ్య, మున్సిపల్​ కమిషనర్​మల్లికార్జున్​ఉన్నారు.