- కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. మంగళవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో అక్కన్నపేట సర్పంచ్ జన్నారపు సంపత్, ఉప సర్పంచ్ లంబ శ్రీలేఖ, పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అక్కన్నపేట అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
