- జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం రాజ్యమేలాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం వెంగళరావు డివిజన్ మధురానగర్, కళ్యాణ్‌నగర్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ప్రగతిశీల, ప్రశాంతమైన హైదరాబాద్ కోసం ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను తుమ్మల కోరారు.
ఈ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ కే పరిమితం కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఉప ఎన్నిక అని పేర్కొన్నారు. ప్రచారంలో మంత్రి వాకిటి శ్రీహరి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ప్రముఖ సినీ నటుడు సుమన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
