
కేసీఆర్ పాలనలోనే నీటివాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జులై 9న ప్రగతి భవన్ లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ఉత్తమ్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఏపీ నీళ్ల దోపిడి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం గురించి వివరించారు మంత్రి ఉత్తమ్.
2014 కంటే ముందు.. కేసీఆర్ అధికారంలోకి రాక ముందు.. కృష్ణా నది నుంచి ఏపీ వెళ్లే నీటి సామర్థ్యం రోజుకు 4.1 టీఎంసీగా ఉండేదిని చెప్పారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్ సీఎం అయిన తర్వాత.. కృష్ణా నుంచి ఏపీకి నీటిని తరలించే సామర్థ్యం రోజుకు 9.6 టీఎంసీకి పెరిగిందని చెప్పారు.. అంటే కేసీఆర్ పరిపాలనలో కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. కేసీఆర్ కంటే ముందు ఉన్న కెపాసిటీ.. కేసీఆర్ పాలనలో డబుల్ అయ్యింది.. తెలంగాణ నీటి వాటాకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 2005 వరకు 44 వేల క్యూసెక్కులు ఉంటే.. 2020 నాటికి 92 వేల క్యూసెక్కులకు పెంచారని చెప్పారు ఉత్తమ్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణకు ఈ అన్యాయం జరిగిందని వివరించారు.
2020 ఆగస్ట్ 5వ తేదీన కేసీఆర్, జగన్ ను అపెక్స్ కమిటీ పిలిచిందని వెల్లడించారు. అపెక్స్ కమిటీకి ఇప్పుడు రాలేం అని లేఖ రాసింది కేసీఆర్ ప్రభుత్వం.. అపెక్స్ కమిటీకి కేసీఆర్ ప్రభుత్వం హాజరుకాకపోవటం వల్ల.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభానికి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి అవకాశం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం.. ఆగస్ట్ 5వ తేదీనే అపెక్స్ కమిటీ ఎదుట కేసీఆర్ ప్రభుత్వం హాజరయ్యి ఉంటే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లకు బ్రేక్ పడేది.. ఏపీకి అనుకూలంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందని వివరించారు ఉత్తమ్.
ప్రజాభవన్ లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్.. 2014 కంటే ముందు కేసీఆర్ అధికారంలోకి రాక ముందు కృష్ణా నది నుంచి ఏపీ వెళ్లే నీటి సామర్థ్యం రోజుకు 4.1 టీఎంసీగా ఉండ..కేసీఆర్ సీఎం అయిన తర్వాత.. కృష్ణా నుంచి ఏపీకి నీటిని తరలించే సామర్థ్యం రోజుకు 9.6 టీఎంసీకి పెరిగింది. అంటే కేసీఆర్ పరిపాలనలో కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాకు తీవ్ర అన్యాయం జరిగింది. కేసీఆర్ కంటే ముందు ఉన్న కెపాసిటీ.. కేసీఆర్ పాలనలో డబుల్ అయ్యింది.. తెలంగాణ నీటి వాటాకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశాడు.
కృష్ణానది ప్రాజెక్టులను కేసీఆర్ గత పదేళ్లలో నిర్లక్ష్యం చేశారు. కల్వకుర్తి,నెట్టెంపాడు,పాలమూరు,ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేది. కృష్ణా జలాల్లో కేసీఆర్ 811టీఎంసీల్లో 512 టీఎంసీలు ఏపీకి అప్పగించేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణకు 299టీఎంసీలు చాలని కేసీఆర్ ,హరీశ్ 2015లో సంతకాలు చేశారు. ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం సరిపోతాయని కేసీఆర్,హరీశ్ సంతకాలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణా జలాల్లో 71 శాతం నీటి వాటా కావాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. 575 టీఎంసీలు తెలంగాణకు కావాలని ట్రిబ్యునల్ ముందు కోరుతున్నాం. తెలంగాణకే 71 శాతం నీళ్లు కావాలని వాదిస్తున్నాం అని వివరించారు.
బీఆర్ఎస్ వాళ్లు రోజూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు చేసింది ఒకటి ప్రచారం చేస్తుంది మరోటి. కృష్ణా నీళ్లను ఔట్ ఆఫ్ బేసిన్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రాజెక్టులు కడుతోందన్నారు. తెలంగాణ ఏర్పడకముందు పోతిరెడ్డి పాడు కెపాసిటీ 44 వేల క్యూసెక్కులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోతిరెడ్డిపాడు కెపాసిటీ 60 వేల క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోతలతో నాగార్జున సాగర్ ఏడారిగా మారే ప్రమాదం ఉంది. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరించారు. దీనిపై జగన్, కేసీఆర్ చర్చలు జరిపారు.