విద్యార్థులు లక్ష్యంతో చదవాలి : మంత్రి వాకిటి శ్రీహరి

 విద్యార్థులు లక్ష్యంతో చదవాలి : మంత్రి వాకిటి శ్రీహరి

మదనాపూరు, వెలుగు :   విద్యార్థులు పాఠశాల దశ నుంచే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని, క్రమశిక్షణతో శ్రమించి వాటిని సాధించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఎంవీ రామన్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘విజ్ఞాన వైభవం-2026’ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతా రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. 51 స్టాల్స్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులు ప్రదర్శించిన 741 వైజ్ఞానిక నమూనాలు చూశామని, అందులో విద్యార్థుల ప్రతిభను అభినందించారు.