
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లా చేగుంటలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ సమక్షంలో పలువురు బీజేపీ,బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం మాట్లాడిన మంత్రి వివేక్.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేద ప్రజలకు విద్యా, వైద్యం, ఇండ్లు అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కమీషన్ల పాలన నడిచిందని ఫైర్ అయ్యారు. కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులిచ్చామని చెప్పారు వివేక్. కొత్త రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ కూడా చేస్తున్నామని చెప్పారు.