
- కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే స్కానింగ్‌లో కనిపించిన బ్రష్
- చైనాలో 64 ఏండ్ల వ్యక్తి కడుపులోంచి తొలగించిన డాక్టర్లు
బీజింగ్: చైనాకు చెందిన యాంగ్ పన్నెండేండ్ల వయసులో పొరపాటున మింగిన టూత్ బ్రష్.. కడుపులో 52 ఏండ్ల పాటు అలాగే ఉండిపోయింది. ఇటీవల తరచుగా కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. స్కాన్ చేయగా చిన్నపేగులో టూత్‌బ్రష్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఎండోస్కోపీ సర్జరీ చేసి 17 సెంటీమీటర్ల పొడవున్న ఆ బ్రష్‌ను బయటకు తీశారు.
మొత్తానికి చిన్నప్పుడు మింగిన బ్రష్ 64 ఏండ్ల వయసులో బయటపడింది. ప్రస్తుతం యాంగ్‌కు ఎలాంటి ఆపద లేదని డాక్టర్లు తెలిపారు. తాను 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు బ్రష్ మింగేసినట్లు యాంగ్ చెప్పారు. అప్పుడు భయంతో తల్లిదండ్రులకు చెప్పలేదన్నారు. ఆ బ్రష్ కడుపులో దానికదే కరిగిపోతుందని అనుకున్నానని తెలిపాడు.