
నిజామాబాద్, వెలుగు: గాంధీ పేరు చోరీ చేసింది సోనియా కుటుంబమేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందన్నారు. ఓటు చోరీ జరిగిందని రాహుల్, ప్రియాంక ఎంపీలుగా, రేవంత్ రెడ్డి సీఎంగా గెలువలేదని, చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేయాలన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో 11 ఏళ్లుగా జరుగుతున్న సుపరిపాలనను భరించలేక కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీసీ సమాజంపై ప్రేమ ఉందని కాంగ్రెస్ చెబుతుంటే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓసీ అభ్యర్థిని ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. పశుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి, నాయకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.