రైతులను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం : హరీశ్ రావు

రైతులను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం : హరీశ్ రావు
  • పంటకు బోనస్ చెల్లించాలని పోస్ట్ కార్డు ఉద్యమం

జహీరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం జహీరాబాద్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.  రైతులకు పార్లమెంట్ ఎన్నికల్లోపు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమం నిర్వహిస్తామని, లక్షలాది మంది రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలని పిలుపునిచ్చారు.  

మాజీ సీఎం కేసీఆర్​ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, కేసీఆర్​కిట్, ఆసరాపెన్షన్లు, దళిత బంధు పథకాలకు మంగళం పాడుతున్నారన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా నయాపైసా ఇవ్వలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, మెడికల్, నర్సింగ్, నవోదయ కాలేజీలు మంజూరు చేయడంలో వివక్ష చూపించిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్​చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, నాయకులు దేవీప్రసాద్, గుండప్ప, తంజీం, రవి కిరణ్ పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చే వరకు పోస్టుకార్డు ఉద్యమం

పుల్కల్: రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పోస్ట్‌‌‌‌కార్డు ఉద్యమాన్ని చేపడతామని హరీశ్​రావు చెప్పారు.  ఈ నెల 16 న సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్‌‌‌‌పూర్‌‌‌‌లో  మాజీ  సీఎం కేసీఆర్ బహిరంగసభకు​హాజరవుతున్నందున  ఆదివారం ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ  సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ.. రైతుల హమీలను ప్రభుత్వం నిలబెట్టుకోనట్లయితే హైదరాబాద్​లోని సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు.ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థి గాలి అనిల్‌‌‌‌కుమార్, మాజీ డీసీసీబీ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జైపాల్‌‌‌‌రెడ్డి, మాజీ మార్కెట్‌‌‌‌ చైర్మన్లు నారాయణ,  నాగభూషణం, మండల అధ్యక్షుడు శివకుమార్, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఉన్నారు.