
- ఎమ్మెల్యే మదన్మోహన్రావు
కామారెడ్డి, వెలుగు : నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ ఆపదొచ్చిన ఆదుకుంటానని ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు హామీ ఇచ్చారు. ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్, రాజంపేట, రామరెడ్డి, తాడ్వాయి మండలాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 17.57 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్వరంలా మారిందని, ఆపద సమయంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.