కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ : ఎమ్మెల్యే రోహిత్ రావు

కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్ ​టౌన్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి బీసీ క్యాంపెయినర్ అని, ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావు, మెదక్​ డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్​అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మెదక్​ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే పార్టీలకు పుట్టగతులుండవన్నారు. రిజర్వేషన్ల అంశం పార్టీలకు అతీతమైందని దీనిపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటని, కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, దేశానికి స్వాతంత్యం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చేశారు. 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఏడాదిన్నర  కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​మాజీ చైర్మన్​చంద్రపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్​చౌదరి, సుప్రభాతరావు, రాజిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రమేశ్ రెడ్డి, పవన్​, మధుసూదన్ రావు, రాజు, ముత్యం గౌడ్, శంకర్, అశోక్, సత్యనారాయణ, నాగరాజు, అక్బర్, పరశురామ్​గౌడ్​, లక్ష్మీనారాయణ, , జ్యోతి, హరిత, శ్రీకాంత్ పాల్గొన్నారు. 

నర్సాపూర్, శివ్వంపేట : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షిస్తూ నర్సాపూర్​లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. 

చేర్యాల: ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షిస్తూ చేర్యాలలో కాంగ్రెస్​నాయకులు సంబరాలు నిర్వహించారు. కొమ్ము కృష్ణా గౌడ్, నానిబాబు, అంజయ్య గౌడ్, మల్లేశం ఆధ్వర్యంలో సీఎం రేవంత్​రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.  వారు మాట్లాడుతూ.. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీలను రాజకీయంగా వాడుకొని పదవులలో అన్యాయం చేశారని, కాంగ్రెస్​మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్, నరసయ్య, రాజయ్య, లావణ్య రఘువీర్, ఎండీ హైమద్, రాములు, నర్సయ్య, బాలరాజు, దామోదర్, రామచంద్రయ్య, కనకయ్య, యాదయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. 

బెజ్జంకి: బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్​నాయకులు పటాకులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​నాయకులు కృష్ణ, దామోదర్, రత్నాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, శ్రీకాంత్, పోచయ్య, సంతోష్, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు .