- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, వెలుగు : క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ జయశంకర్ మినీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా మహిళల వాలీబాల్ టోర్నీని ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్‌గౌడ్, బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నార్ల సురేశ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాకవి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు.
