రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు : ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

 రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు : ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి
  • ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్‌లో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జనరల్‌ హాస్పిటల్‌ను ఆయన సందర్శించారు.  హాస్పిటల్ లో రోగులు, డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

స్పందించిన ఆయన వైద్య శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్‌కు రావాల్సిన బిల్లులు, మందులు, స్టాఫ్‌ కొరత గురించి వివరించారు. హాస్పిటల్‌లో కొత్తగా రెండు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని టీజీఎంఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్‌ ఉషారాణి, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.