
- ఎమ్మెల్యే సునీతా రెడ్డి
చిలప్ చెడ్, వెలుగు: జగదాంబ సేవాలాల్ ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. మండలంలోని సాల్లా తండా, బద్రియ తండాలో మంగళవారం జరిగిన బోనాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ జగదాంబా దీక్ష తీసుకున్న భక్తులు బోనాలు, డీజే, డప్పు చప్పుల్లతో నిర్వహించిన ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, రాజేందర్ రెడ్డి, భిక్షపతి, శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మధుసూదన్, రామచంద్ర రెడ్డి, దుర్గారెడ్డి, ముకుంద రెడ్డి, గోపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి, అనిల్, కున్యా నాయక్ పాల్గొన్నారు.