
నర్సాపూర్, వెలుగు: రత్నాపూర్ అంగన్వాడీలో శనివారం భోజనం తిని అస్వస్థతకు గురై నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను ఆదివారం ఎమ్మెల్యే సునీతా రెడ్డి పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సీపీడీఓ హేమ భార్గవిని ఫోన్ ద్వారా వివరణ కోరగా తాగునీటిలో సుందెలుక పడగా అది గమనించని పిల్లలు నీళ్లు తాగి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
పిల్లల తల్లి దండ్రులతో అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ఆమె వెంట బీఆర్ఎస్ శ్రేణులు చంద్రాగౌడ్, మన్సూర్, మహేశ్ గుప్తా, హరికృష్ణ, రమాకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, నాయకులు శివ కుమార్, వేమా రెడ్డి, రాం మోహన్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, విజయ్, బాలేశ్, రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.