దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

పిట్లం, వెలుగు : గ్రామాల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం పిట్లంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు  అర్హులకు అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.

సర్పంచ్​లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్ గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్​ లైటింగ్ పనులు, కొత్త అంగన్​వాడీ భవనాలు, కరెంట్ స్తంభాలు, మురుగు కాలువలు, పాఠశాల భవనాలు,  రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మండలంలోని సర్పంచ్​లు పాల్గొన్నారు.