హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఉదయం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు  ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.  ఈ  క్రమంలో  పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాంపల్లి-మేడ్చల్, మేడ్చల్-హైదరాబాద్(47251) మార్గాల్లో వెళ్లే ఎంఎంటీస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 

2024 జనవరి 10వ తేదీన  నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు(12760) పట్టాలు తప్పింది.  రైలు వేగంగా వచ్చి ప్లాట్ ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. చెన్నై నుంచి ఈ ఉదయం నాంపల్లికి చేరుకున్న ట్రైన్.. . ప్లాట్ ఫాంపైకి వస్తున్న సమయంలో.. పట్టాలు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదం సమయంలో సైడ్ వాల్ దగ్గర ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు రైల్వే అధికారులు. గాయపడిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని.. స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు.