న్యూఢిల్లీ : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెల వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు మసకబారడంతో దేశ రాజధానిలో మంగళవారం (నవంబర్ 18) బంగారం ధరలు పడ్డాయి. పది గ్రాముల రేటు రూ. 3,900 తగ్గి రూ.1,25,800కు చేరింది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.5 శాతం స్వచ్ఛత గల పసడి ధర రూ. 3,900 తగ్గి 10 గ్రాములకు రూ. 1,25,200కి పడిపోయింది. వెండి కిలో ధర రూ. 7,800 తగ్గి రూ. 1.56 లక్షలకు చేరుకుంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ. 1,25,560 నుంచి రూ. 1,23,660కి తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ. 1,14,950 నుంచి రూ. 1,13,350 పడిపోయింది.
