ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి : ఎంపీ అర్వింద్

ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి : ఎంపీ అర్వింద్
  • ఎంపీ అర్వింద్​

నిజామాబాద్, వెలుగు: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ఎంపీ అర్వింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిరికొండ, ధర్పల్లి, భీంగల్​ మండలాల్లో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నష్టాలను లెక్కించడంలో ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారని, ఈ పాటికి రెడీ చేసి ఉంటే తాను కేంద్రం సాయాన్ని  కోరేవాడినన్నారు. వరద ఎఫెక్ట్​ గ్రామాలకు అధికారులు ఒకసారి వచ్చి వెళ్లడం ఏమీ బాగోలేదని, శానిటేషన్​పై ఫోకస్ పెట్టాలన్నారు. 

ఇండ్లలో చేరిన బురద తొలగించడానికి పంచాయతీ స్టాఫ్​ను ఉపయోగించాలని కోరారు. హెల్త్​ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. విచారణ పేరుతో కాళేశ్వరం అంశాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇన్నాళ్లు లాక్కొచ్చి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. విషయాన్ని సీబీఐకి అప్పగిస్తూ తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్​ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​కులాచారి తదితరులు ఉన్నారు.