
- ఆల్మట్టి ఎత్తు విషయంలో పోరాటం చేస్తాం: ఎంపీ చామల
హైదరాబాద్, వెలుగు: ఆల్మట్టి ఎత్తు విషయం లో కర్నాటక ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి బొట్టును కూడా వదులుకోమన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏం పట్టించుకోలేదన్నారు.