ములుగు, వెలుగు : రైతులకు ఇబ్బందులు కలుగకుండా సకాలంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించారు. సోమవారం ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి అన్నంపల్లి రోడ్డులోని సాయి లక్ష్మీ నరసింహ కాటన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం అవసరమని, సాంకేతిక లోపాలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు కిసాన్ కపాస్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు.
