ముంబైలోని బోరివలి వెస్ట్‌లో ఓ జ్యువెలరీ షాపులో ఊహించని స్టయిల్లో దొంగతనం జరిగింది. షాపులో సేల్స్‌మెన్‌లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు సుమారు రూ. 6.79 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, వెండి కడ్డీలతో పరారయ్యారు.
పోలీసుల సమాచారం ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన ప్రభు సింగ్, నారాయణ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఐసి కాలనీలోని మై గోల్డ్ పాయింట్ అనే జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నారు. షాపు ఓనర్ రాకేష్ పోర్వాల్ వారిని నమ్మి రాత్రి పూట విలువైన వస్తువులను బీరువాల్లో పెట్టి లాక్ చేసే పనిని వారికి అప్పగించాడు.
మంగళవారం రాత్రి షాపు మూసివేసిన తర్వాత సేల్స్‌మెన్‌లు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. బుధవారం ఉదయం షాపు ఓనర్ పని మీద ఊరికి వెళ్ళాడు. అయితే, షాపు బయట నుండి లాక్ చేసి ఉండటం గమనించిన ఒక కస్టమర్ ఓనరుకి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఓనర్ సేల్స్‌మెన్‌లకు ఫోన్ చేయగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి.
►ALSO READ | చెరువులో దూసుకెళ్లిన కారు.. నీళ్లు చల్లగా ఉన్నాయని రక్షించలేని రెస్క్యూటీం..కళ్ల ముందే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
దింతో ఓనర్ కంగారుగా షాపుకి వచ్చి చూసేసరికి లోపల ఉన్న రెండు ఇనుప బీరువాలు ఖాళీగా ఉన్నాయి. దొంగిలించిన వస్తువుల్లో రూ. 15 లక్షల విలువైన డైమండ్, 1.8 కిలోల వెండి కడ్డీలు, 650 గ్రాముల తాకట్టు పెట్టిన బంగారం, రెండు 100 గ్రాముల బంగారు బిస్కెట్లు.. వీటితో పాటు 23 మంగళసూత్రాలు, 325 ఉంగరాలు, 235 చెవిపోగులు, గొలుసులు ఇతర వజ్రాభరణాలు ఉన్నాయి.
షాపు ఓనర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు వారి సొంత ఊరు రాజస్థాన్‌కు పారిపోయి ఉంటారెమో అని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని పట్టుకునేందుకే గాలిస్తున్నారు.
